-
-
Home » Mukhyaamshalu » musi river overflow in hyderabad live update vreddy
-
LIVE UPDATES: హైదరాబాద్‌ను ముంచిన మూసీ
ABN , First Publish Date - Sep 27 , 2025 | 12:24 PM
హైదరాబాద్‌ను వరణుడు వణికిస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న రోడ్లు, ఇండ్లు నీటమునిగాయి. ఇందుకు సంబంధించిన LIVE UPDATES ఇక్కడ తెలుసుకోండి.
Live News & Update
-
Sep 27, 2025 21:09 IST
మూసీకి తగ్గిన వరద ఉధృతి..
హైదరాబాద్ : మూసీకి వరద ఉధృతి తగ్గింది.
ఊపిరి పీల్చుకుంటున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల.
నిన్న రాత్రి అత్యధికంగా జంట జలాశయాల నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసిన అధికారులు.
జంట జలాశయాలకు ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గడంతో.. అవుట్ ఫ్లో తగ్గించిన జలమండలి అధికారులు.
ఉస్మాన్ సాగర్‌కి 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 8 గేట్లు ఎత్తి 6,176 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్న అధికారులు.
హిమాయత్ సాగర్‌కి 5 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 4 గేట్లు ఎత్తి 3,581 క్యూసెక్కుల అవుట్ ఫ్లో విడుదల చేస్తున్న అధికారులు.
-
Sep 27, 2025 17:33 IST
మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, మలక్‌పేటలోని పునరావాస కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు ఉన్నారు.
జంట జలశయాల గేట్లు ఎత్తడంతో పై నుండి వస్తున్న వరద వల్ల చాదర్‌ఘాట్ బ్రిడ్జి మునిగిపోవడంతో చౌదర్‌ఘాట్ బ్రిడ్జిని పరిశీలించారు.
వరద ప్రభావం అధికంగా ఉండడంతో బ్రిడ్జి పై ప్రజలను ఎవరిని అనుమతించవద్దని పోలీసులను ఆదేశించారు మంత్రి పొన్నం.
చాదర్ ఘాట్ బ్రిడ్జి సైడ్ వాల్స్ దెబ్బతినడంతో వరద తగ్గిన తరువాత వెంటనే బ్రిడ్జి పై నుండి ఎవరిని అనుమతించవద్దని సూచించారు.
మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలు మునిగిపోవడంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారని, ఇళ్ల వద్దకు ఎవరు రాకుండా చూసుకోవాలని తెలిపారు.
-
Sep 27, 2025 17:29 IST
తొగర్ పల్లిలో పొంగిపొర్లుతున్న చెరువు..
సంగారెడ్డి: భారీ వర్షాలకు కొండాపూర్ (మం) తొగర్ పల్లిలో పొంగిపొర్లుతున్న చెరువు.
వరదల్లో చిక్కుకున్న చెరువుకు అవతలి వైపు నివాసం ఉంటున్న సుమారు 45 మంది.
నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోయిన రవాణా, విద్యుత్.
వరద పెరుగుతుండటంతో కాలనీ వాసుల్లో ఆందోళన.
కాపాడాలంటూ టిజిఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.
పడవ సహాయంతో బయటకు తీసుకువచ్చిన స్థానికులు.
బాధిత కుటుంబాలకు స్థానిక పాఠశాలలో ఆశ్రయం.
సహాయక చర్యలు దగ్గరుండి పరిశీలించిన నిర్మలా జగ్గారెడ్డి.
-
Sep 27, 2025 17:25 IST
వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహారం అందిస్తున్న అధికారులు..
-
Sep 27, 2025 17:18 IST
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..
-
Sep 27, 2025 17:18 IST
ముంపు బాధితులకు అండగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్..
ఉస్మాన్ సాగర్ నుంచి వరద నీటిని కిందికి వదలడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా అంబర్‌పేట్ పరిధిలోని అంబేద్కర్ నగర్, శంకర్ నగర్ ప్రాంతాలలో వరద నీరు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జలమయం అయ్యింది. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత ప్రజలను అధికారులు శంకర్ నగర్‌లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, వరద బాధితులకు అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అండగా నిలిచారు. వరద బాధితులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి బాధితులకు సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. కాగా, ముంపు బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు అధికారులు. అంబేద్కర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో అంబర్‌పేట్ డివిజన్ పరిధిలోని బాధితులకు, కాచిగూడ బాధితులకు బన్సార్ భవన్‌లో, గోల్నాక బాధితులకు కృష్ణానగర్ ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు.
-
Sep 27, 2025 17:10 IST
మూసీ పరిసరాల్లో కొండచిలువ కలకలం..
అంబర్‌పేట్‌లోని అలీకేఫ్ చౌరస్తా సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతంలో కొండచిలువ కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కొండ చిలువ కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉస్మాన్ సాగర్ నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో ముసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మూసీ కాలువ ఒడ్డున ఉన్న చికెన్ షాపులో కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
-
Sep 27, 2025 17:06 IST
ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన..
-
Sep 27, 2025 17:04 IST
మూసీ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాజాసింగ్..
-
Sep 27, 2025 16:43 IST
నీట మునిగిన హైదరాబాద్.. డ్రోన్ విజువల్స్ చూసేయండి..
-
Sep 27, 2025 16:39 IST
వరద బాధితులను బోట్‌లలో తరలిస్తున్న అధికారులు..

-
Sep 27, 2025 16:35 IST
మూసి ప్రక్షాళనకు సహకరించాలి: బల్ముర్ వెంకట్
భారీ వర్షానికి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో మూసి పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి: ఎమ్మెల్సీ బల్ముర్ వెంకట్
అంబర్‌పేట్‌లో ముసారాంబబాగ్ బ్రిడ్జి నీట మునిగింది.
కృష్ణా నగర్, దుర్గా నగర్ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూసిని ప్రక్షాళన చేయాలి. లేదంటే ఇబ్బంది ఎదురైతదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు.
కృష్ణా నగర్, అంబేద్కర్ నగర్, దుర్గానగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర చేశారు.
రామ చందర్ రావు, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ సాక్స్‌లు, మస్కిటో కాయిన్స్ పెట్టుకొని పడుకున్నారు.
ఈటెల రాజేందర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. గాడిద పండ్లు తోముకుంటున్నారా?
బీజేపీ నేతలందరు ఇప్పుడు పోయి అక్కడ పడుకోవాలి.
ఈ ఒక్క రాత్రి పోయి పడుకోవాలి. అక్కడ పరిస్థితులు తెలుస్తాయి.
పార్టీ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కేటీఆర్‌కు సోయి ఉంటది కానీ.. వరద బాధితులను పరామర్శించే సోయి లేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గం అంబర్‌పేట ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారు?
సమస్యకు శాశ్వత పరిస్కారం చేయాలని ప్రభుత్వం చూస్తుంది.
ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకరించాలి.
మూసి గర్భంలో ఇండ్లు కట్టుకున్న వారిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి.
దానికి మీరందరు సహకరించాలి.
-
Sep 27, 2025 16:27 IST
మూసీ ఉధృతికి గోల్నాకలో నీట మునిగిన అంబేద్కర్ నగర్
వరదలో చిక్కుకున్న 20కి పైగా కుటుంబాలు.
నిన్న రాత్రి నుంచి సహాయం కోసం ఎదురుచూపులు.
బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్న DRF బృందాలు.
-
Sep 27, 2025 16:24 IST
తగ్గుముఖం పట్టిన మూసీ వరద..
మూసీ వరద ప్రభావం కొంత మేర తగ్గుముఖం పట్టింది. దీంతో చాదర్ ఘాట్, ముసానగర్, శంకర్ నగర్ ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. మురుగు మయంగా మారిన ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు.
-
Sep 27, 2025 16:22 IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన..
హైదరాబాద్: చాదర్ ఘాట్ మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయ లక్ష్మి.
-
Sep 27, 2025 16:17 IST
ప్రజలకు హైడ్రా అలర్ట్..
ఏబీఎన్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్.
మూసి పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం.
రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తింది.
ఎంజీబీఎస్‌లో డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో వరద పరిస్థితి అదుపులోకి వచ్చింది.
బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం.
వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి.
మూసి పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-
Sep 27, 2025 13:23 IST
పురానపూల్ శివాల ఘాట్ వద్ద ఆలయంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకు వచ్చిన రెస్క్యూ టీమ్
క్రేన్ సహాయంతో నలుగురిని సురక్షితంగా తీసుకువచ్చిన డిఆర్ఎఫ్ , హైడ్రా సిబ్బంది
అకస్మాత్తుగా వరదరావడంతో రాత్రి నుంచి ఆలయంలోనే చిక్కుకున్న నలుగురు ఆలయ సిబ్బంది
-
Sep 27, 2025 13:00 IST




-
Sep 27, 2025 12:54 IST
శ్రీశైలంలో పెరిగిన వరద ఉదృతి.. 10 గేట్లు ఓపెన్..
-
Sep 27, 2025 12:52 IST
హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితిపై డ్రోన్ విజువల్స్
-
Sep 27, 2025 12:48 IST
నీటమునిగిన శివాలయం.. విజువల్స్
-
Sep 27, 2025 12:43 IST
MGBS వద్ద మూసీ ప్రవాహం.. విజువల్స్
-
Sep 27, 2025 12:41 IST
నిజాంపేట్ లో రోడ్లపై ప్రవిస్తున్న నీరు..
-
Sep 27, 2025 12:35 IST
articleText
-
Sep 27, 2025 12:34 IST
యాదాద్రి జిల్లాలో మూసి నది ఉధృతి
జూలూరు-రుద్రవెల్లి దగ్గర మూసీ ఉగ్రరూపం
బ్రిడ్జి పైనుంచి భారీగా ప్రవహిస్తున్న మూసీ వరద
పోచంపల్లి-బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు
వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వా దగ్గర..
లోలెవన్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ నది
చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలు బంద్
మూసీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Sep 27, 2025 12:32 IST
మునిగిన MGBS.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
మూసీ నది ప్రవాహానికి మునిగిన MGBS..
సెలవులు కావడంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు MGBS కు చేరిన ప్రయాణికులు.
ప్రయాణికులను బస్ స్టాండ్ నుంచి తరలిస్తున్న అధికారులు
-
Sep 27, 2025 12:29 IST
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్
హిమాయత్ నగర్,నల్లకుంట, అమీర్ పెట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
ఆ రూట్లో వెళ్లే వారు వేరే మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచన
-
Sep 27, 2025 12:24 IST
మూసీ ఉధృతికి గోల్నాకలో నీట మునిగిన అంబేద్కర్ నగర్
వరదలో చిక్కుకున్న 20కి పైగా కుటుంబాలు
నిన్న రాత్రి నుంచి సహాయం కోసం ఎదురుచూపులు
బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్న DRF బృందాలు