Safety Tips: పిడుగు పడేప్పుడు ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి..
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:08 PM
వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. అయితే, పిడుగు పడినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ముఖ్య విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Safety Tips: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం సర్వసాధారణం. అయితే, వీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, వీటి కారణంగా మనుషులు చనిపోయిన ఘటనలు కూడా చాలా చూశాం. కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిడుగు పడినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ముఖ్య విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పిడుగులు పడే సమయంలో సురక్షితంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పిడుగులు చాలా ప్రమాదకరమైనవి, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీరు ఆవిరై మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు పైకి వెళ్ళే కొద్దీ చల్లబడి చిన్న నీటి బిందువులు లేదా మంచు కణాలుగా మారతాయి. ఈ మేఘాలలో ధనావేశిత, రుణావేశిత కణాలు ఏర్పడతాయి. ఒకానొక సమయంలో ఈ కణాల మధ్య విద్యుత్ ఘర్షణ జరిగి పిడుగులు ఏర్పడతాయి.
పిడుగు పడేటప్పుడు మీరు ఇంట్లో ఉంటే, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్విచ్ ఆఫ్ చేయండి. టీవీలకు దూరంగా ఉండండి. మీరు ఇంట్లో ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయండి. ఎందుకంటే మెరుపు కిటికీల గుండా కూడా ప్రవేశించగలదు. నీటి పైపులు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి. ఎందుకంటే పిడుగు విద్యుత్ నీటిలో లేదా తీగల ద్వారా ప్రవహించగలదు. చెట్ల కింద లేదా ఎత్తైన ప్రదేశాలలో ఉండకండి. ఎందుకంటే ఇవి పిడుగును ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి సమయంలో బయటకు అస్సలు వెళ్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్‌గా ఉండండి.
Also Read:
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఈ సూపర్ స్కీమ్ గురించి మీకు తెలుసా..
ఆషాడ మాసం.. కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా..
For More Lifestyle News