Share News

Nail Polish Relationship Impact: ఈ రంగు నెయిల్ పాలిష్ వేసుకుంటే.. మీ లవర్‌తో బ్రేకప్ ఖాయం..!

ABN , Publish Date - Jul 04 , 2025 | 08:23 AM

నెయిల్ పాలిష్ రంగు మీ జీవితంపై ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? కలర్ సైకాలజీ ప్రకారం, కొన్ని రంగులు మన చుట్టూ ఉన్న వ్యక్తులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి.

Nail Polish Relationship Impact: ఈ రంగు నెయిల్ పాలిష్ వేసుకుంటే.. మీ లవర్‌తో బ్రేకప్ ఖాయం..!
Nail Polish

Nail Polish Relationship Impact: అమ్మాయిలు అందంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకోసం అనేక బ్యూటీ టిప్స్ పాటిస్తారు. వేసుకునే జుట్టు నుంచి కాళ్ల చెప్పుల వరకూ అన్ని మ్యాచింగ్ వేసుకుంటారు. అంతేకాదు.. చేతి, కాలి గోర్లను సైతం రకరకాల నెయిల్ పాలిష్‌తో అందంగా అలంకరించుకుంటారు. అయితే, నెయిల్ పాలిష్ రంగు మీ జీవితంపై ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? కలర్ సైకాలజీ ప్రకారం, ప్రతి రంగు మన మనసు, ప్రవర్తనపై ప్రభావం చూపుతుందట. కొన్ని రంగులు మనలో శాంతి, స్థిరతను కలిగిస్తే, మరికొన్ని చిరాకు లేదా కోపానికి గురి చేస్తాయి. కలర్ సైకాలజీ ప్రకారం.. ఏ నెయిల్ పాలిష్ రంగులు మీ ప్రియుడితో విభేదాలను పెంచుతాయో తెలుసుకుందాం..


నలుపు:

కలర్ సైకాలజీ ప్రకారం.. ఫ్యాషన్ పరంగా బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ స్టైలిష్‌గా కనిపించినా, ఇది సంబంధాలను దూరం చేస్తుంది. ఇది మీ ప్రియుడికి మీపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేస్తుంది. తద్వారా మీకు దూరం అయ్యేందుకు కారణమవుతుంది.

మెరూన్ రెడ్:

ఈ రంగు నెయిల్ పాలిష్ అధిక దూకుడు లేదా డామినేటింగ్ నేచర్‌ను చూపిస్తాయి. మీ ప్రియుడు సున్నిత స్వభావం కలవాడు అయితే, ఇది ఆయనకు అసౌకర్యంగా అనిపించవచ్చు.

బూడిద రంగు:

ఈ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్న వారు డల్‌గా, భావోద్వేగాలు లేనట్టుగా కనిపిస్తారు. ఇది నెగెటివ్ ఎనర్జీకి కారణం కావచ్చు. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం, అభిరుచి వేరుగా ఉంటుంది. మీరు ఏ రంగు నెయిల్ పాలిష్ వేసుకోవాలో నిర్ణయించుకునే ముందు మీ స్వభావం, మీ ప్రియుడి అభిరుచి రెండింటినీ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు చిన్న మార్పులు కూడా సంబంధాన్ని బలపరుస్తాయి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఆఫీస్ బ్యాగ్‌లో ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా..

చర్మంపై మచ్చలతో బాధపడుతున్నారా.. ఈ కూరగాయ రసంతో చెక్ పెట్టండి..

For More Lifestyle News

Updated Date - Jul 04 , 2025 | 09:18 AM