Share News

Jewellery Cleaning Tips: మీ బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లోనే కొత్తవిగా మెరిసేలా చేయండి!

ABN , Publish Date - Jul 24 , 2025 | 08:03 PM

సాధారణంగా కాలక్రమంలో బంగారం, వెండి ఆభరణాలు రంగు తగ్గి నల్లగా మారిపోతాయి. మీ ఆభరణాలు కూడా నల్లగా మారాయా? అయితే, ఇలా ఇంట్లోనే కొత్తవిగా మెరిసేలా చేయండి!

Jewellery Cleaning Tips:  మీ బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లోనే కొత్తవిగా మెరిసేలా చేయండి!
Jewellery Cleaning

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణంగా కాలక్రమేణా బంగారం, వెండి ఆభరణాలు రంగు మారే అవకాశం ఉంది. బంగారం ఆక్సీకరణ చెందదు, కాని వెండి ఆక్సీకరణ చెందుతుంది, కాబట్టి అది కాలక్రమేణా మసకబారి రంగు తగ్గిపోతుంది. అంతేకాకుండా, ఆభరణాలు నల్లగా మారిపోతాయి. ఇక అప్పుడు ఆభరణాలను కొత్తలా మెరిసేలా చేయడానికి దుకాణానికి తీసుకెళ్తారు. కానీ, ఇంట్లోనే సురక్షితంగా తక్కువ ఖర్చుతో నగలు శుభ్రం చేసుకునే చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..


నిమ్మకాయ, ఉప్పు పద్ధతి

ఒక గ్లాస్ నీటిని వేడి చేయండి. అందులో నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి కలపండి. ఆ ద్రావణంలో నగలు నిమిషాల కొద్దీ ఉంచండి. తరువాత మృదువైన బ్రష్‌తో శుభ్రం చేయండి. ఆభరణాలు కొత్తవిగా మెరుస్తాయి.

బేకింగ్ సోడా, షాంపూ టెక్నిక్

ఓ గిన్నెలో కొంత వేడి నీరు తీసుకోండి. అందులో రూపాయి విలువైన ఏదైన షాంపూ ప్యాకెట్, కొంచెం బేకింగ్ సోడా కలపండి. ఈ మిశ్రమంలో నగలను ఒక గంట పాటు ఉంచండి. ఆపై బ్రష్‌తో తుడిచేయండి. శుభ్రం చేసిన తర్వాత అవి మెరిసేలా కనిపిస్తాయి.


టూత్‌పేస్ట్ పద్ధతి

సాధారణ వైట్ టూత్‌పేస్ట్‌ను నగలపై అప్లై చేయండి. టూత్ బ్రష్ సహాయంతో మెల్లగా రుద్దండి. వాటిని నీటితో కడిగి, శుభ్రమైన గుడ్డతో తుడిచేయండి. మళ్ళీ మెరిసేలా కనిపిస్తాయి.

ఇంకొన్ని సూచనలు:

  • చాలా ముదురు నలుపు వచ్చేసిన నగలపై బేకింగ్ సోడా + ఉప్పు కలిపిన పేస్ట్ అప్లై చేయండి

  • 10 నిమిషాలపాటు అలాగే ఉంచి, ఆపై బ్రష్‌తో శుభ్రం చేయండి

  • ఏ మిశ్రమాన్ని అయినా ముందుగా చిన్న భాగంలో పరీక్షించండి

  • ముత్యాలు, ఎమిరాల్డ్ లాంటి సున్నితమైన రాళ్లపై వేడి నీరు, రుద్దడం వంటివి ఉపయోగించకండి.

  • ఈ చిట్కాలు పాటిస్తే మీ బంగారు, వెండి ఆభరణాలు బయట తీసుకెళ్లకుండా ఇంట్లోనే కొత్తలా మెరిసిపోతాయి.!


Also Read:

ల్యాండ్ స్నార్కెలింగ్ .. 2025లో సరికొత్త ట్రెండ్.!

పాత బట్టలు పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

For More Lifestyle News

Updated Date - Jul 24 , 2025 | 08:04 PM