Share News

Government Business Schemes: వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా.. ఈ ప్రభుత్వ పథకాలతో త్వరగా లోన్ పొందండి..

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:41 PM

చాలా మందికి వ్యాపారం చేయాలని ఉంటుంది. కానీ, సరైన రుణాలు అందకపోవడంతో కొంతమంది వెనకడుగు వేస్తారు. అయితే, అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

Government Business Schemes: వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా.. ఈ ప్రభుత్వ పథకాలతో త్వరగా లోన్ పొందండి..
Business Loan

Government Business Schemes: మీరు మీ స్వంత వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రభుత్వ రుణ పథకాల ద్వారా సులభంగా రుణం పొందవచ్చు. చాలా మందికి వ్యాపారం చేయాలని ఉంటుంది. కానీ, సరైన రుణాలు అందకపోవడంతో కొంతమంది వెనకడుగు వేస్తారు. అయితే, అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే, మీరు ఈ పథకాల ద్వారా సులభంగా రుణాలు పొంది, మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా అభివృద్ధి చేయవచ్చు.


క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్

క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) అనేది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (MSMEలు) ఆర్థిక సహాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. ఈ పథకం ఎంఎస్ఎంఇ లకు ఎటువంటి హామీ లేదా భద్రత అవసరం లేకుండా రుణాలు ఇస్తుంది. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు.

బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటేషన్ స్కీమ్

కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటేషన్ స్కీమ్ (Bank Credit Facilitation Scheme) పథకం ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) రుణాలను అందిస్తుంది. ప్రభుత్వ ఒప్పందంతో కూడిన బ్యాంకుల ద్వారా త్వరగా రుణం పొందవచ్చు.


సిడ్బీ మేక్ ఇన్ ఇండియా లోన్

ఈ స్కీం అందించే రుణం ద్వారా వ్యాపారాలను వెంటనే ప్రారంభించవచ్చు. ముఖ్యంగా, పెట్టుబడితో పాటుగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, సౌకర్యాలను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

స్టాండప్ ఇండియా స్కీమ్

షెడ్యూల్డ్ క్యాస్ట్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ట్రేడింగ్, తయారీ, సర్వీసెస్ వంటి మొదలైన రంగాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి స్టాండప్ ఇండియా స్కీమ్ రుణాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు.


Also Read:

ఎయిర్ పాడ్స్ యూజర్లు జాగ్రత్త.. మీరు కూడా ఈ తప్పు చేస్తే..

ఇంట్లో ఈ చోట్ల టీవీ పెడితే డేంజర్.. షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోవచ్చు..

For More Lifestyle News

Updated Date - Jun 26 , 2025 | 01:41 PM