Share News

Chanakya Neeti In Telugu: జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే మీరే కింగ్..

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:51 AM

Chanakya Neeti In Telugu: మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ 6 రకాల మనుషులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణిక్యుడు అన్నాడు. వీరికి దూరంగా ఉంటే అన్ని రకాలుగా మనకు మంచి జరుగుతుందని అన్నాడు. ఆ 6 రకాల మనుషులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Neeti In Telugu: జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే మీరే కింగ్..
Chanakya Neeti In Telugu

ప్రతీ ఒక్క మనిషికి ఏదైనా సాధించాలన్న తపన ఉంటుంది. సక్సెస్ కోపం పరితపిస్తుంటారు. కానీ, నూటికి 50 శాతం మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. మనం సక్సెస్ అవ్వటానికి..అవ్వలేకపోవడానికి కారణం మన ఎంపికలు.. నిర్ణయాలే. ముఖ్యంగా మనం ఎవరితో ఉంటున్నాం అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం.. మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ 6 రకాల మనుషులకు దూరంగా ఉండాలి. అప్పుడే మానసికంగా.. శారీరకంగా కూడా బాగుంటాం.


డబ్బు కాదు క్యారెక్టర్ ముఖ్యం

డబ్బుంది కదా అని ఎవరితో పడితే వారితో స్నేహం చేయకండి. మంచి విలువలు, నిజాయితీ ఉన్న వ్యక్తుల్నే జీవితంలోకి అనుమతించండి. ఇలాంటి గుణాలు ఉన్న వారే మనతో ఎక్కువ కాలం కలిసి నడుస్తారు. మన కష్టనష్టాల్లో తోడుంటారు. సక్సెస్‌కు మార్గాలు వేస్తారు.

మాటలు కాదు.. చేతలు ముఖ్యం

ఏ బంధం అయినా కావచ్చు.. మాటల కంటే చేతలే ముఖ్యం. కొంతమంది మన కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం.. మనల్ని అంత ప్రేమిస్తున్నాం.. ఇంత ప్రేమిస్తున్నాం అంటారు. కానీ, చేతల దగ్గరకు వచ్చే సరికి వారి ప్రవర్తన సూన్యం. నిజంగా వారు మనల్ని అభిమానిస్తుంటే.. ప్రేమిస్తుంటే.. మాటల్లో కాదు.. చేతల్లో కనబడుతుంది. చేతల్లో మన మీద ప్రేమను చూపించే వారు.. మన సక్సెస్ కోసం చివరి వరకు తోడుంటారు.


ఎప్పటికీ ఓకేలా ఉండేవాళ్లు

మనతో ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించే వారితోటే ఉండండి. కొంతమంది ఉంటారు.. ఈ రోజు మనతో బాగుంటారు. కొన్ని రోజుల తర్వాత మనం ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తారు. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లను అస్సలు నమ్మకండి.

స్నేహాలే విలువల్ని నిర్ణయిస్తాయి..

మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నదాన్ని బట్టే మనకు సమాజంలో విలువ ఉంటుంది. మన భవిష్యత్తు కూడా వారి వల్ల మారుతుంది. మంచి స్నేహాలు మంచిగా ముగుస్తాయి. చెడు స్నేహాలు చెడుగా ముగుస్తాయి.


నిజాయితీని పరీక్షించండి

ఈ ప్రపంచంలో కాలం కంటే అత్యంత విలువైనది ఏదైనా ఉంటే.. అది కచ్చితంగా నిజాయితీనే.. ఏ బంధంలోనైనా సరే నిజాయితీ లేకపోతే అది ఎక్కువ కాలం నిలవదు. మన దగ్గర అన్నీ ఉన్నపుడు అందరూ ఉంటారు. కానీ, ఏమీ లేనప్పుడు కూడా ఉండేవాళ్లే మన వాళ్లు. అలాంటి వాళ్లను ఎప్పుడూ మిస్ చేసుకోకండి.

నెగటివ్ గాళ్లు..

కొంతమందికి మనం ఏదైనా సాధిస్తామన్న నమ్మకం ఉంటుంది. అలాంటి వారు మనకు తోడుగా ఉంటారు. మరికొంతమంది ఉంటారు. మనం ఏదైనా చెబితే.. ‘ హా.. చేసినపుడు చూద్దాంలే’..‘ నీకంత సీన్ ఉందా?’ అంటూ ఎగతాళి చేస్తారు. మనల్ని అన్ని విధాలా నెగిటివ్ వైపు లాగడానికి చూస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి.


ఇవి కూడా చదవండి:

Bank Holiday: బ్యాంకుకు వెళ్తున్నారా.. అయితే ఇది చదవండి

Viral Video: పాపం.. ఈ ముసలాయన కష్టం ఎవరికీ రాకూడదు..

లక్నోలో సమావేశం

Updated Date - Apr 10 , 2025 | 10:02 AM