Share News

Ukrainian President Volodymyr Zelensky: రేపు ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:46 AM

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ...

Ukrainian President Volodymyr Zelensky: రేపు ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ

వాషింగ్టన్‌, డిసెంబరు 26: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్‌ అఽధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ శుక్రవారం ప్రకటించారు. 20 సూత్రాల శాంతి ప్రణాళిక దాదాపు 90 శాతం ఖరారయినట్లు, యుద్ధం ముగింపుపై ఆశాభావంతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌ భద్రతా హామీలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలిపారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కాఫ్‌, ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌తో ఇటీవల జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ, ట్రంప్‌ భేటీపై ఆసక్తి నెలకొంది.

Updated Date - Dec 27 , 2025 | 03:46 AM