Lightning Megaflash: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు.. టెక్సాస్ నుంచి కాన్సాస్ వరకు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 09:35 PM
Lightning Megaflash: 2020 ఏప్రిల్ 29వ తేదీన కూడా అమెరికాలో ఓ భారీ మెరుపు మెరిసింది. ఆకాశంలో అడ్డంగా మెరిసిన ఆ మెరుపు పొడువు 768 కిలోమీటర్లు. అది టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి వరకు వ్యాపించింది.
2017, అక్టోబర్ నెలలో అమెరికాలో అత్యంత భారీ మెరుపు ఒకటి మెరిసింది. ఆ మెరుపు కారణంగా రాత్రి కూడా పగల్లా మారిపోయింది. ఆకాశం తగలబడిపోయిందా అన్న భ్రమ కలిగింది. ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. వృద్ధులు కూడా అలాంటి మెరుపును ముందెన్నడూ చూసి లేరు. ఆ మెరుపు గురించి కథలు, కథలుగా జనం చెప్పుకున్నారు. 8 ఏళ్ల క్రితం నాటి ఆ మెరుపు తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యంత పొడవైన మెరుపుగా చరిత్రలోకి ఎక్కింది.
ఆ మెరుపు పొడవు అక్షరాలా 829 కిలోమీటర్లు. టెక్సాస్ నుంచి కాన్సాస్ వరకు ఆ మెరుపు వ్యాప్తి చెందింది. గతంలో 61 కిలోమీటర్ల మీద ఉన్న రికార్డును ఈ మెరుపు తుడిచిపెట్టింది. ది వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) గురువారం అధికారికంగా పొడవైన మెరుపుపై ప్రకటన చేసింది. శాస్త్రవేత్తలు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఆ మెరుపు పొడవును అంచనా వేశారు. మెరుపు మెరిసిన ఎనిమిదేళ్ల తర్వాత రికార్డ్‌ను కట్టబెట్టారు. దీనిపై వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్, ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన జియోగ్రాఫికల్ సైంటిస్ట్ ర్యాండీ సెర్వెనీ మాట్లాడుతూ..
‘మేము దాన్ని మెగాఫ్లాష్ మెరుపు అని పిలుస్తున్నాము. అలాంటి మెరుపులు ఎలా? ఎందుకు? వస్తున్నాయి అన్న దాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకంటే గొప్పవైనవి ఎన్నో ఉన్నాయి. రానున్న రోజుల్లో వాటిని మేము హై క్వాలిటీ లైటనింగ్ మెజర్‌మెంట్స్ ద్వారా తెలుసుకుంటాం’ అని అన్నారు. కాగా, 2020 ఏప్రిల్ 29వ తేదీన కూడా అమెరికాలో ఓ భారీ మెరుపు మెరిసింది. ఆకాశంలో అడ్డంగా మెరిసిన ఆ మెరుపు పొడువు 768 కిలోమీటర్లు. అది టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి వరకు వ్యాపించింది.
ఇవి కూడా చదవండి
రీల్స్ చేసే వారికి టీటీడీ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు..
భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు