Scientist Soumya: ఏకధాటిగా పనిచేస్తే సామర్థ్యం తగ్గుతుంది
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:56 AM
విశ్రాంతి ఎప్పుడు అవసరమో తెలుసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సూచించారు.
శరీరం చెప్పినట్లు విని విశ్రాంతి తీసుకోవాలి
డబ్ల్యూహెచ్‌వో మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య
న్యూఢిల్లీ, మార్చి9: ఏకధాటిగా పనిచేయడం వల్ల సామర్థ్యం తగ్గుతుందని, శరీరం చెప్పింది వింటూ విశ్రాంతి ఎప్పుడు అవసరమో తెలుసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సూచించారు. పనిచేయడానికి మానసిక విశ్రాంతి అవసరమన్నారు. ఎన్ని గంటలు పనిచేశామనేది కాదని, నాణ్యత ముఖ్యమని స్వామినాథన్ తేల్చి చెప్పారు. పని గంటలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఈ ఏడాది ఆరంభంలో ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ అన్నారు.