Share News

Venezuelan President Nicolas Maduro: అమెరికా దాడి చేసేలా ఉంది.. ఆయుధాలు ఇవ్వండి

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:44 AM

తమ దేశానికి సమీపంలో, కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్‌ల సాయం కోరుతూ...

Venezuelan President Nicolas Maduro: అమెరికా దాడి చేసేలా ఉంది.. ఆయుధాలు ఇవ్వండి

  • రష్యా, చైనా, ఇరాన్‌లకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో లేఖలు

వాషింగ్టన్‌, నవంబరు 3: తమ దేశానికి సమీపంలో, కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్‌ల సాయం కోరుతూ నికోలస్‌ మదురో లేఖలు రాశారు. అమెరికా తమపై దాడి చేయవచ్చని అందులో ఆందోళన వ్యక్తం చేశారు. క్షిపణులు, రాడార్లు అందజేయాలని, తమ యుద్ధ విమానాలకు మరమ్మతులు చేయాలని పుతిన్‌, జిన్‌పింగ్‌లను కోరారు. ఇటీవల ఇరాన్‌లో పర్యటించిన వెనెజువెలా మంత్రి సెలెస్టినో.. ఆ దేశం నుంచి సాయుధ డ్రోన్లు, ఆయుధాల సరఫరాపై చర్చించారు. మరోవైపు సైన్యాన్ని, ఆయుధాలను తరలించేందుకు వీలు కల్పించే ‘ఇల్యుషిన్‌ ఐఎల్‌-76’ రవాణా విమానాన్ని రష్యా తాజాగా వెనెజువెలాకు అందజేసిందని ఫ్లైట్‌రాడార్‌24 వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే, ఇప్పటికిప్పుడు వెనెజువెలాపై యుద్ధం చేసే ఆలోచనేదీ లేదని, కాకపోతే మదురోకు రోజులు దగ్గరపడ్డాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 04 , 2025 | 05:53 AM