US to Deny Tourist Visas: అమెరికాలో ప్రసవం కోసమే అయితే టూరిస్టు వీసా ఇవ్వం
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:41 AM
అమెరికాలో బిడ్డకు జన్మ ఇవ్వాలన్న ప్రణాళికతో టూరిస్టు వీసా కావాలని కోరితే అందుకు ట్రంప్ ప్రభుత్వం నిరాకరించనుంది....
రాయబార కార్యాలయం ప్రకటన
న్యూఢిల్లీ, డిసెంబరు 11: అమెరికాలో బిడ్డకు జన్మ ఇవ్వాలన్న ప్రణాళికతో టూరిస్టు వీసా కావాలని కోరితే అందుకు ట్రంప్ ప్రభుత్వం నిరాకరించనుంది. అమెరికా భూభాగంపై జన్మించే వారికి సహజసిద్ధ పౌరసత్వం రానుండడంతో ఆ నిబంధనను అవకాశంగా తీసుకొని ఆ దేశంలో ప్రసవం చేసుకోవాలని కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇకపై ఇలాంటి అడ్డుదారులను మూసివేయనున్నట్టు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘‘పౌరసత్వం పొందడం కోసం అమెరికా భూభాగంపై బిడ్డకు జన్మనిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వారి వీసా దరఖాస్తులను పరిశీలించబోం. అలాంటి వారికి కాన్సులేట్ అధికారులు టూరిస్టు వీసాలను తిరస్కరిస్తారు. అనుమతించేది లేదు’’ అని స్పష్టం చేసింది.