Share News

US Senator Claims: భారత సైనికుల్ని కరిగించటానికి చైనా ఎలకో్ట్రమ్యాగ్నెటిక్‌ ఆయుధం!

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:32 AM

ఐదేళ్ల కిందటి గల్వాన్‌ ఘర్షణ సందర్భంగా భారత సైనికుల మీద చైనా ఎలకో్ట్రమ్యాగ్నెటిక్‌ ఆయుధాన్ని ప్రయోగించిందని అమెరికా సెనేటర్‌ ...

US Senator Claims: భారత సైనికుల్ని కరిగించటానికి చైనా ఎలకో్ట్రమ్యాగ్నెటిక్‌ ఆయుధం!

వాషింగ్టన్‌, సెప్టెంబరు12: ఐదేళ్ల కిందటి గల్వాన్‌ ఘర్షణ సందర్భంగా భారత సైనికుల మీద చైనా ఎలకో్ట్రమ్యాగ్నెటిక్‌ ఆయుధాన్ని ప్రయోగించిందని అమెరికా సెనేటర్‌ బిల్‌ హ్యాగెర్టీ తెలిపారు. ‘ఐదేళ్ల కిందట ఓ సరిహద్దు గొడవపై ఇరుదేశాలు ఘర్షణకు దిగాయి. ఈ సందర్భంలో భారత్‌ సైనికుల్ని కరిగించడానికి చైనా ఎలకో్ట్రమ్యాగ్నెటిక్‌ ఆయుధాన్ని ఉపయోగించింది’ అని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంతన్నది నిర్ధారణకాలేదు. గల్వాన్‌ ఘర్షణ సమయంలోనూ ఈ తరహా ఆయుధం గురించి ఎలాంటి వార్తలు వెలువడలేదు. చైనాకు ఇండియా దగ్గరవుతున్న వేళ హ్యాగెర్టీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Updated Date - Sep 13 , 2025 | 03:32 AM