Alexander Duncan: హనుమాన్‌పై అమెరికన్ నేత విద్వేష వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:45 AM
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం సుగర్ ల్యాండ్ పట్టణంలో ప్రతిష్టించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ తీవ్ర వివాదాస్ప...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం సుగర్ ల్యాండ్ పట్టణంలో ప్రతిష్టించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ తీవ్ర వివాదాస్పద, మత విద్వేష వ్యాఖ్యలు చేశాడు. ‘నకిలీ హిందూ దేవుడికి సంబంధించిన నకిలీ విగ్రహాన్ని ఇక్కడ టెక్సా్‌సలో మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది క్రిస్టియన్ దేశం’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో నోరుపారేసుకున్నాడు. అలెగ్జాండర్ డంకన్ పోస్టుపై హిందూ సమాజం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డంకన్ వ్యాఖ్యలను ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేసింది. కాగా, టెక్సాస్ రాష్ట్రం సుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ కాంస్య విగ్రహాన్ని గతేడాది ఏర్పాటు చేశారు.