Trump Administration: స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను 3.5 శాతానికి తగ్గింపు
ABN , Publish Date - May 25 , 2025 | 04:29 AM
ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన విదేశీ పంపకాల పన్నును 5% నుంచి 3.5%కి తగ్గించింది. అమెరికాలోని భారతీయులు తమ దేశాలకు పంపే రెమిటెన్స్‌పై ఈ కొత్త పన్ను విధింపు అమలులోకి వస్తోంది.
రెమిటెన్స్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను స్వల్పంగా తగ్గించిన ట్రంప్ సర్కారు
తొలుత ప్రతిపాదించినది 5 శాతం
ఎన్నారైలకు ఊరటనిచ్చిన నిర్ణయం
అమెరికాలో ఫోన్లు తయారు చేయకుంటే దిగుమతి సుంకం
సామ్‌సంగ్ కంపెనీకి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్, మే 24: విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి స్వదేశాలకు పంపే సొమ్ము (రెమిటెన్సు)పై విధించిన పన్నులో ట్రంప్ సర్కారు స్వల్ప ఊరటనిచ్చింది. ‘ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్‌ఫర్స్’గా పేర్కొంటున్న ఈ పన్నును తొలుత 5శాతంగా ప్రతిపాదించగా.. ఇప్పుడు 3.5 శాతానికి తగ్గించారు. అంటే ఉదాహరణకు రూ.లక్ష స్వదేశానికి పంపితే.. తొలి ప్రతిపాదన ప్రకారం రూ.5 వేలు పన్ను కింద చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.3,500కు తగ్గింది. అమెరికా నుంచి విదేశాలకు సొమ్మును బదిలీ చేసే బ్యాంకులు, మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థలే.. ఈ మేరకు పన్ను వసూలు చేసి, ప్రభుత్వానికి అందజేస్తాయి. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ పేరిట రూపొందించిన ఈ పన్నుల చట్టం బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ కేవలం ఒక్క ఓటు మెజారిటీతో (అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు) ఆమోదం తెలపడం గమనార్హం. అమెరికాలో సుమారు 44.6 లక్షల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. వారిలో చాలా మంది అక్కడ సంపాదించిన సొమ్మును భారత్‌కు పంపిస్తూ ఉంటారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..