Share News

US Planning a New Core-5 Bloc : భారత్‌తో పంచ దేశాల కూటమి?

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:09 AM

అమెరికా అధ్యక్షుడు మరో కొత్త వ్యూహానికి తెర తీస్తున్నారు. భారత్‌, రష్యా, చైనా, జపాన్‌తో పాటు అమెరికాను కూడా కలుపుకొని పంచ దేశాల కూటమి కోర్‌-5...

US Planning a New Core-5 Bloc : భారత్‌తో పంచ దేశాల కూటమి?

  • అందులో అమెరికాతో పాటు రష్యా, చైనా, జపాన్‌

  • కోర్‌-5 ఎలైట్‌ గ్రూప్‌ ఏర్పాటుకు ట్రంప్‌ ప్రణాళికలు

న్యూఢిల్లీ, డిసెంబరు 12: అమెరికా అధ్యక్షుడు మరో కొత్త వ్యూహానికి తెర తీస్తున్నారు. భారత్‌, రష్యా, చైనా, జపాన్‌తో పాటు అమెరికాను కూడా కలుపుకొని పంచ దేశాల కూటమి కోర్‌-5 (సీ5)ను ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎలైట్‌ గ్రూప్‌ ద్వారా యూరప్‌ ఆధిపత్యం ఉన్న జీ7, ఇతర సంప్రదాయ ప్రజాస్వామ్య, సంపద ఆధారిత దేశాల కూటములకు చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ అమెరికన్‌ ప్రచురణ సంస్థలు ‘పొలిటికో’, ‘డిఫెన్స్‌ వన్‌’ కథనాల ప్రకారం.. వైట్‌హౌస్‌ గత వారం విడుదల చేసిన నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీకి సంబంధించిన సుదీర్ఘ, అముద్రిత వెర్షన్‌లో ఈసరికొత్త శక్తిమంతమైన కూటమికి సంబంధించిన వివరాలున్నాయి. కాగా, ఈ కథనాలను వైట్‌హౌస్‌ ఖండించింది.

Updated Date - Dec 13 , 2025 | 05:09 AM