Share News

President Donald Trump: అమెరికాలో ముగిసిన 43 రోజుల షట్‌డౌన్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 03:55 AM

అమెరికాలో రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్‌డౌన్‌కు ముగింపు పలుకుతూ ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేశారు.....

President Donald Trump: అమెరికాలో ముగిసిన 43 రోజుల షట్‌డౌన్‌

వాషింగ్టన్‌, నవంబరు 13: అమెరికాలో రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్‌డౌన్‌కు ముగింపు పలుకుతూ ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేశారు. అంతకుముందు షట్‌డౌన్‌ ఎత్తివేతకు సంబంధించిన బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. 222-209 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. షట్‌డౌన్‌ను ముగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సెనేట్‌ ఇంతకుముందే ఆమోదించింది. తాజా బిల్లు వచ్చే ఏడాది జనవరి 30 వరకూ నిధులను పొడిగించనుంది. షట్‌డౌన్‌ మొదలైన తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన ఫెడరల్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, వారికి జీతాలు చెల్లించడం వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. ఆహార సహాయ కార్యక్రమాలపై ఆధారపడే వారికోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ సాయాన్ని పునరుద్ధరిస్తారు.

Updated Date - Nov 14 , 2025 | 04:24 AM