Share News

US Commerce Minister: భారత్‌ను సరిదిద్దాల్సిన అవసరం ఉంది

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:17 AM

భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ మరోసారి రెచ్చిపోయారు. భారత్‌ను సరిదిద్దాల్సిన అవసరం ఉందంటూ...

US Commerce Minister: భారత్‌ను సరిదిద్దాల్సిన  అవసరం ఉంది

  • అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ మరోసారి రెచ్చిపోయారు. భారత్‌ను సరిదిద్దాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశ కంపెనీలకు భారతదేశం తన మార్కెట్లను తెరవాలని, అమెరికా ప్రయోజనాలకు భంగం కలగించని విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్‌, బ్రెజిల్‌, భారత్‌ సహా అమెరికా వాణిజ్య భాగస్వాములైన కొన్ని దేశాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. ‘‘ఇవన్నీ అమెరికా విషయంలో సరిగ్గా స్పందించాల్సి దేశాలు. మీ మార్కెట్లను తెరవండి. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే విధానాలు వెంటనే ఆపేయండి.ఇలాంటి వాటివల్లే మేము వారితో విభేదిస్తున్నాం’’అని హోవార్డ్‌ తెలిపారు. అమెరికా వినియోగదారులకు భారత్‌ తన ఉత్పత్తులను విక్రయించాలని భావిస్తే అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని తేల్చిచెప్పారు.

Updated Date - Sep 29 , 2025 | 03:29 AM