Share News

US Pakistan Relations: పాక్‌పై అమెరికా వల్లమాలిన ప్రేమ!

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:48 AM

పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి వల్లమాలిన ప్రేమను చాటుకుంది..! పాక్‌కు భారీగా సైనిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది....

US Pakistan Relations: పాక్‌పై అమెరికా వల్లమాలిన ప్రేమ!

  • ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్ల ఆధునికీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

ఇస్లామాబాద్‌, డిసెంబరు 11: పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి వల్లమాలిన ప్రేమను చాటుకుంది..! పాక్‌కు భారీగా సైనిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్ల ఆధునికీకరణ, ఇతర సాంకేతిక సాయం కోసం 68.6 కోట్ల డాలర్ల (సుమారు రూ.6,196 కోట్లు) విలువైన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా పాక్‌కు అత్యాధునిక సాంకేతికత, విడిభాగాలు, నిర్వహణ వంటి సాయం అందించనుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎ్‌ససీఏ) యూఎస్‌ కాంగ్రె్‌సకు లేఖ పంపినట్టు పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక గురువారం వెల్లడించింది.

Updated Date - Dec 12 , 2025 | 03:48 AM