India US defense deal: భారత్‌కు అమెరికా జావెలిన్ క్షిపణి
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:31 AM
భారతదేశానికి 93మిలియన్ డాలర్ల దాదాపు రూ.825 కోట్ల విలువైన ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సంబంధిత రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50శాతానికి పెంచిన తర్వాత..
న్యూయార్క్/వాషింగ్టన్, నవంబరు 20: భారతదేశానికి 93మిలియన్ డాలర్ల (దాదాపు రూ.825 కోట్ల) విలువైన ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సంబంధిత రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50శాతానికి పెంచిన తర్వాత.. అమెరికాతో మనదేశం కుదుర్చుకున్న అతిపెద్ద రక్షణ పరికరాల ఒప్పందం ఇదే. భారత్ రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ విక్రయం మరింత మెరుగుపరుస్తుందని, ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి, రాజకీయ స్థిరత్వాలను కొనసాగించడంలో భారత్ ప్రధాన శక్తిగా కొనసాగడానికి ఉపకరిస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ ఆశాభా వం వ్యక్తం చేసింది. మొత్తం 216 ‘ఎం982ఏ1 ఎక్స్‌క్యాలిబర్ టాక్టికల్ ప్రొజెక్టైల్స్’, 100ఎఫ్‌జీఎం-148 జావెలిన్ క్షిపణులకొనుగోలుకు భార త ప్రభుత్వం తమను అభ్యర్థించిందని ఆ ఏజెన్సీ వెల్లడించింది. వీటితోపాటు.. ప్రధాన రక్షణ పరికరాల కిందికి రాని పలు అనుబంధ ఉపకరణాలు, పోర్టబుల్ ఎలకా్ట్రనిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ విత్ ఇంప్రూవ్డ్ ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేషన్ కిట్(ఐపీఐకే), ప్రైమర్లు, ప్రొపెల్లెంట్ చార్జెస్, అమెరికా ప్రభుత్వ సాంకేతిక సహాయం, సాంకేతిక సమాచారం, రిపేర్ అండ్ రిటర్న్ సేవలు, లాజిస్టిక్స్, ప్రోగ్రామ్ సపోర్ట్‌వంటివి కూడా ఈ అమ్మకంలో భాగమని పేర్కొంది. కాగా అమెరికా ఇచ్చిన ఎఫ్‌జీఎం-148 యాంటీ ట్యాంక్ జావెలిన్ క్షిపణుల సాయంతో.. ఉక్రెయిన్ సైన్యం రష్యా యుద్ధ ట్యాంకులను సమర్థంగా ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌వాసులు.. ఆ క్షిపణులను తమను రక్షించే దేవదూతలు అనే అర్థం వచ్చేలా ‘సెంట్ జావెలిన్’గా వ్యవహరించడం ప్రారంభించారు. కెనడాకు చెందిన ఒక ఆర్టిస్టు ‘సెంట్ జావెలిన్’ చిత్రాన్ని రూపొందించి ఉక్రెయిన్‌వాసుల కోసం పది లక్షల డాలర్లకుపైగా విరాళాలు సేకరించాడు. దీని ప్రత్యేకత ఏమి టంటే.. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 దేశా లు ఉపయోగిస్తున్న అత్యంత అధునాతనమైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్. దీన్ని సైనికులు తమ భుజం మీద పెట్టుకుని శత్రుట్యాంకుల పైకి ప్రయోగించవచ్చు. ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్ అనే అత్యంత అధునాతన సెన్సర్ ద్వారా ఒక్కసారి లక్ష్యాన్ని లాక్ చేసి ట్రిగర్ నొక్కాక.. దీన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. మిసైల్ తన కెమెరా/సెన్సర్ల సాయంతో తానే లక్ష్యాన్ని వెంబడిస్తుంది.