Share News

KFC Outlet Over Racial Abuse: భారతీయుడిని బానిస అన్నందుకు 81.22 లక్షల జరిమానా

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:57 AM

లండన్‌లోని ఓ కేఎ్‌ఫసీ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడిని మేనేజర్‌ జాతి వివక్షతో దూషించి, అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు...

 KFC Outlet Over Racial Abuse: భారతీయుడిని బానిస అన్నందుకు 81.22 లక్షల జరిమానా

లండన్‌, డిసెంబరు 28: లండన్‌లోని ఓ కేఎ్‌ఫసీ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడిని మేనేజర్‌ జాతి వివక్షతో దూషించి, అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు 81.22 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది. తమిళనాడుకు చెందిన మాదేశ్‌ 2023 జనవరిలో కేఎ్‌ఫసీ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌లో పనిచేయడానికి లండన్‌ వెళ్లాడు. అందులో శ్రీలంకకు చెందిన తమిళుడు కాజన్‌ మేనేజర్‌గా ఉన్నాడు. మేనేజర్‌ తనను ‘బానిస’, ‘భారతీయులు మోసగాళ్లు’ వంటి వ్యాఖ్యలతో దూషించారంటూ మాదేశ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. తాను భారతీయుడు అనే కారణంతో మేనేజర్‌ సెలవు కూడా ఇచ్చేవాడు కాదని, అధిక సమయం పనిచేయాలని ఒత్తిడి చేసేవాడని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాడు. మేనేజర్‌ అనుచితంగా ప్రవర్తన రుజువు కావడంతో ట్రైబ్యునల్‌ జరిమానా విధించింది.

Updated Date - Dec 29 , 2025 | 12:57 AM