Two Indian CEO: హెచ్1బీ ఫీజు గోల వేళ..రెండు అమెరికా కంపెనీలకు భారతీయ సీఈవోలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:58 AM
హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు, ఇతర చర్యలతో భారత నిపుణులకు, విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం పొగపెడుతున్న సమయంలో..
టీ-మొబైల్ సీఈవోగా శ్రీని గోపాలన్
మోల్సన్ కూర్స్ అధ్యక్షుడిగా రాహుల్
వాషింగ్టన్, సెప్టెంబరు 23: హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు, ఇతర చర్యలతో భారత నిపుణులకు, విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం పొగపెడుతున్న సమయంలో.. రెండు అమెరికా కంపెనీలు తమ సీఈవోలుగా ఇద్దరు భారతీయులను నియమించుకున్నాయి. అమెరికాలో అతిపెద్ద టెలికాం సంస్థ ‘టీ-మొబైల్’ తమ సీఈవోగా శ్రీని గోపాలన్‌ను నియమించింది. ప్రస్తుత సీఈవో మైక్ సీవెర్ట్ స్థానంలో నవంబర్ 1 నుంచి గోపాలన్ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించింది. అహ్మదాబాద్ ఐఐఎంలో చదువుకున్న గోపాలన్.. హిందూస్థాన్ యూనిలివర్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం టీ-మొబైల్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా ఉన్నారు. ఆయన పనితీరు, ప్రతిభ ఆధారంగా సీఈవో పదవికి ఎంపిక చేసినట్టు టీ-మొబైల్ పేర్కొంది. ఇక అమెరికాలో ప్రముఖ బీర్లు, ఇతర పానీయాల సంస్థ మోల్సన్ కూర్స్ సంస్థ సీఈవోగా 49 ఏళ్ల రాహుల్ గోయల్ నియమితులయ్యారు. మైసూర్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన.. తర్వాత అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. అక్కడే మోల్సన్ కూర్స్ సంస్థలో చేరారు. 24 ఏళ్లుగా అదే సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు.