Trump Warns Supreme Court Limits: సుంకాలపై సుప్రీం కోర్టు వ్యతిరేక తీర్పుతో దేశ భద్రతకే ముప్పు
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:32 AM
అమెరికా ఇతర దేశాలపై సుంకాలు విధించడంపై ఆ దేశ సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు...
వాషింగ్టన్, డిసెంబరు 10: అమెరికా ఇతర దేశాలపై సుంకాలు విధించడంపై ఆ దేశ సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు విధించే అంశంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసేలా సుప్రీం కోర్టు తీర్పునిస్తే అది దేశ భద్రతకే ముప్పు అని హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ ఇష్టమొచ్చినట్టుగా విదేశాలపై సుంకాలు విధించడాన్ని సవాలు చేస్తూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై యూఎస్ సుప్రీం కోర్టులో నవంబరు 5 నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రంప్ స్పందించారు.