Share News

US President Donald Trump: హమాస్‌‌కు డెడ్‌లైన్‌

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:04 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌... హమా్‌సకు డెడ్‌లైన్‌ విధించారు. తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై స్పందిచేందుకు హమా్‌సకు మూడు నుంచి నాలుగు రోజులు గడువు ఇస్తున్నానని తెలిపారు...

US President Donald Trump: హమాస్‌‌కు డెడ్‌లైన్‌

  • శాంతి ప్రణాళికపై 3-4 రోజుల్లో స్పందించాలి

  • లేదంటే వారి కథ విషాదాంతమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • ‘గాజా’ శాంతి ప్రణాళికను స్వాగతించిన ప్రధాని మోదీ

  • ఎనిమిది అరబ్‌, ముస్లిం దేశాలు కూడా..

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌... హమా్‌సకు డెడ్‌లైన్‌ విధించారు. తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై స్పందిచేందుకు హమా్‌సకు మూడు నుంచి నాలుగు రోజులు గడువు ఇస్తున్నానని తెలిపారు. ‘హమాస్‌ ఒప్పుకుంటుందా సరే.. లేదంటే వారి కథ విషాదాంతమే అవుతుంద’ని హెచ్చరించారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్‌ ఈ ప్రణాళికను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. హమా స్‌ ఆయుధాలను వదిలేయడం, 72 గంటల్లో బందీలను విడిచిపెట్టడం, గాజా నుంచి ఇజ్రాయెల్‌ దశలవారీగా వైదొలగడం, గాజా పునర్నిర్మాణానికి చర్యలు ట్రంప్‌ ప్ర ణాళికలో ప్రధాన ప్రతిపాదనలు. ఈ ప్రణాళికను శ్వేత సౌధంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సమక్షంలో ట్రంప్‌ ప్రకటించారు. దీనికి ఇప్పటికే ఇజ్రాయెల్‌తో పాటు అరబ్‌, ముస్లిం దేశాలు అంగీకరించాయని, హమాస్‌ స్పందనకోసం ఎదురుచూస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. అయితే ట్రంప్‌ ప్రణాళికపై అధ్యయనం చేసిన తర్వాత స్పందిస్తామని హమాస్‌ ప్రకటించింది. ట్రంప్‌ డెడ్‌లైన్‌ విధించకముందు హమాస్‌ ప్రకటన వెలువడింది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ ప్రణాళికను ప్రధాని మోదీ స్వాగతించారు. అది పశ్చిమాసియాలో శాంతి నెలకొనడానికి బాట వేయడంతో పాటు పాలస్తీనా, ఇజ్రాయెల్‌ ప్రజల భద్రతకు, అభివృద్ధికి దోహదపడుతుందని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అన్ని భాగస్వామ్య పక్షాలు ట్రంప్‌ వెనక కలసికట్టుగా నిలబడతాయని, యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలుకుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ స్పందనపై ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రణాళికతో భారత్‌ వంటి దేశాలు తమ ప్రాం తంలో పునర్నిర్మాణ కార్యకలాపాలు చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 8 అరబ్‌, ముస్లిం దేశాలు కూడా ట్రంప్‌ ప్రణాళికను స్వాగతించాయి. ఈ మేరకు జోర్డాన్‌, ఖతార్‌, యూఏఈ, ఇండోనేషియా, పాకిస్థాన్‌, తుర్కియే, సౌదీ, ఈజిప్టు విదేశాంగ మంత్రు లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రంప్‌ కృషి విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు రష్యా తెలిపింది. గాజా యుద్ధంలో ఇప్పటికే 66 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.

Updated Date - Oct 01 , 2025 | 02:04 AM