US President Donald Trump: భారత్ బియ్యంపై పన్నులేస్తా
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:04 AM
భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే బియ్యంపై మరిన్ని పన్నులు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారతీయులు పన్నులు చెల్లించాల్సిందేనని హూంకరించారు...
భారతీయులు సుంకాలు చెల్లించాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, డిసెంబరు 9: భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే బియ్యంపై మరిన్ని పన్నులు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారతీయులు పన్నులు చెల్లించాల్సిందేనని హూంకరించారు. అమెరికా వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సోమవారం వైట్‌హౌ్‌సలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రంప్ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యవసాయ రంగానికి ట్రంప్ 12 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ ప్రకటించారు. ఈ సమావేశంలో బియ్యం ఉత్పత్తి, దిగుమతులపై చర్చ రాగా.. లూసియానాలో కెన్నడీ రైస్ మిల్ పేరుతో బియ్యం వ్యాపారం చేస్తున్న మెరిల్ కెన్నడీ అధ్యక్షుడి కి భారత్‌పై ఫిర్యాదు చేశారు. భారతీయ వ్యాపారులు అమెరికా మార్కెట్లలోకి వారి బియ్యాన్ని కుమ్మరిస్తున్నారని, పన్నులపై మినహాయింపులు కూడా పొందుతున్నారని తెలిపారు. ఇతర దేశాల బియ్యం రాకతో అమెరికా బియ్యానికి డిమాండ్ లేక స్థానిక ఉత్పత్తిదారులు, వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు. దీంతో ఆ దేశాలేవి? అని ట్రంప్ ప్రశ్నించగా, ఆమె.. ‘ఇండియా, థాయ్‌లాండ్.. చైనా కూడా ప్యూర్టోరికోకు కొన్నేళ్లుగా తన బియ్యాన్ని తరలిస్తోంది. మీరు విధించిన అధిక పన్నులు పనిచేస్తున్నాయి. కానీ, మాకు ఇంకా పెద్ద నిర్ణయాలు కావాలి’ అని అన్నారు. వెంటనే ట్రంప్.. వాణిజ్య శాఖ మంత్రి బెసెంట్ వైపు తిరిగి.. ‘ఇండియా గురించి చెప్పు? వారికి ఎందుకు అలా (బియ్యం దిగుమతికి) అనుమతిస్తున్నారు? వాళ్లు సుంకాలు చెల్లించాల్సిందే. బియ్యం దిగుమతిపై వారికి ఏమైనా మినహాయింపులు ఉన్నా యా?’ అని ప్రశ్నించారు. అందుకు బెసెంట్ స్పందిస్తూ.. ‘లేదు సర్.. వారితో వాణిజ్య ఒప్పందం కోసం మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం’ అని సమాధానమిచ్చారు. దీంతో ‘వాళ్లు (భారత్) బియ్యాన్ని మనదే శంలో కుమ్మరించటానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు.
పన్నులేసినా ప్రభావం తక్కువే..
భారత బియ్యం దిగుమతులపై ట్రంప్ పన్నులేసి నా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని భారత బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్‌ఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్ తెలిపారు. భారత మొత్తం బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 3ు మాత్రమేనని చెప్పారు. ‘మన బియ్యానికి ప్రధాన మార్కెట్ పశ్చిమాసియా మాత్రమే. అంతేకాదు బిర్యానీ వంటి కొన్ని వంటకాలకు భారతీయ బియ్యానికి ప్రత్యామ్నా యం లేదు. అమెరికాలో పండే బియ్యం నాణ్యతలో మన బియ్యంతో పోటీ పడలేవు. ఇప్పటికే భారత వస్తువులపై ట్రంప్ 50ు టారి్‌ఫలు విధించా రు. బియ్యంపై మరిన్ని టారి్‌ఫలు వేసినా మన వ్యా పారులకు పెద్దగా నష్టం రాదు. అమెరికా ప్రజలు మాత్రం ఎక్కువ ధర చెల్లించి బియ్యం కొనాల్సి ఉంటుంది’ అని ఐఆర్‌ఈఎఫ్ ఉపాధ్యక్షుడు దేవ్‌గార్గ్ పేర్కొన్నారు.