Share News

Trump said his voice Became strained: ఆ దేశపు మూర్ఖులపై అరిచా..

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:21 AM

ఓ దేశంతో వాణిజ్య చర్చల సందర్భంగా మూర్ఖపు వ్యక్తులపై గట్టిగా అరిచానని, దానితో తన గొంతు బొంగురుపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు.....

Trump said his voice Became strained: ఆ దేశపు మూర్ఖులపై అరిచా..

  • అందుకే గొంతు బొంగురుపోయింది : ట్రంప్‌

వాషింగ్టన్‌, నవంబరు 18: ఓ దేశంతో వాణిజ్య చర్చల సందర్భంగా మూర్ఖపు వ్యక్తులపై గట్టిగా అరిచానని, దానితో తన గొంతు బొంగురుపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే ఆ దేశం ఏదో చెప్పడానికి నిరాకరించారు. సోమవారం అధ్యక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో తన గొంతు బొంగురుపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘వాణిజ్యం, సుంకాల అంశంపై చర్చల సందర్భంగా ఓ దేశపు వారిపై గట్టిగా అరిచాను. ఎందుకంటే వారు మూర్ఖులు. ఒప్పందంపై పునఃసంప్రదింపులకు ఆ దేశం ప్రయత్నం చేస్తోంది. దాంతో చిరాకు వేసింది. వారికి నా అభిప్రాయాన్ని గట్టిగా కుండబద్దలు కొట్టనట్టు చెప్పాను’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్‌ సహా పలు ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇదిలా ఉండగా, అమెరికా, భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొలిక్కి వస్తున్నాయని, త్వరలోనే శుభవార్త వినొచ్చని కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 04:21 AM