Share News

Donald Trump: ట్రంప్‌కు ఫిఫా శాంతి బహుమతి

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:08 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నట్టుగానే ‘శాంతి దూత’ అయ్యారు. 8యుద్ధాలు ఆపానంటూ ఆయన గట్టిగా కోరుకున్నట్టుగానే శాంతి బహుమతి వచ్చింది...

Donald Trump: ట్రంప్‌కు ఫిఫా శాంతి బహుమతి

  • ప్రదానం చేసిన ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య

వాషింగ్టన్‌, డిసెంబరు 5: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నట్టుగానే ‘శాంతి దూత’ అయ్యారు. 8యుద్ధాలు ఆపానంటూ ఆయన గట్టిగా కోరుకున్నట్టుగానే శాంతి బహుమతి వచ్చింది. కానీ నోబెల్‌ కాదు.. ఫిఫా శాంతి బహుమతి. ‘ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య’ తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ శాంతి బహుమతిని శుక్రవారం ట్రంప్‌కు ప్రదానం చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి జట్ల ఎంపికపై శుక్రవారం వాషింగ్టన్‌లో డ్రా వేడుక జరిగింది. ట్రంప్‌ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో ఈ సందర్భంగా ట్రంప్‌కు శాంతి బహుమతిని ప్రదానం చేశారు. బంగారు రంగులో ఉన్న పెద్ద ట్రోఫీని, నీలి రంగు రిబ్బన్‌తో కూడిన స్వర్ణ పతకాన్ని అందజేశారు. ‘నిజంగా ఇది నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవం. భారత్‌-పాక్‌ యుద్ధం సహా ఎన్నో యుద్ధాలు ఆపి.. లక్షలాది ప్రాణాలు కాపాడను. నిజానికి నాకు బహుమతులు అవసరం లేదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఫిఫా శాంతి బహుమతిని ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Updated Date - Dec 06 , 2025 | 04:08 AM