Share News

US President Donald Trump: ఉగ్రపోరులో కలిసి రండి!

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:24 AM

ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంతర్జాతీయ సమాజానికి కీలక పిలుపునిచ్చారు

US President Donald Trump: ఉగ్రపోరులో కలిసి రండి!

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటనపైఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపు

వాషింగ్టన్‌, డిసెంబరు 17: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంతర్జాతీయ సమాజానికి కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు దేశాలన్నీ కలిసి రావాలని ఆయన కోరారు. ‘‘ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాలన్నీ ఏకంకావాలి.’’ అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను ‘రాడికల్‌ ఇస్లామిక్‌ టెర్రరిస్టులు’గా ఆయన పేర్కొన్నారు. వైట్‌హౌ్‌సలో మంగళవారం జరిగిన ‘హనుక్కా’ కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొన్నారు. మరోవైపు.. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఖనన ప్రక్రియను ఆస్ట్రేలియా ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. మరోవైపు, దేశ, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రంప్‌ పలు దేశాల ప్రజలకు ప్రయాణ నిషేధం(ట్రావెల్‌ బ్యాన్‌) విధించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా పాలస్తీనా సహా మరో 20 దేశాలను చేర్చారు. దీనికి సంబంధించిన ప్రకటనపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేశారు. ఆయా దేశాల ప్రజలు అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు మరిన్ని పరిమితులు, నిబంధనలు విస్తరించారు. మరో 15 దేశాలపై పాక్షిక నిబంధనలు వర్తింపజేశారు.

Updated Date - Dec 18 , 2025 | 02:24 AM