Share News

Katy Perry: ప్రియురాలు కేట్‌ పెర్రీతో కలిసి ట్రుడో జపాన్‌ పర్యటన

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:11 AM

కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రుడో తన ప్రియురాలు, అమెరికా పాప్‌స్టార్‌ కేట్‌పెర్రీతో కలిసి జపాన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ జపాన్‌ మాజీ....

 Katy Perry: ప్రియురాలు కేట్‌ పెర్రీతో కలిసి ట్రుడో జపాన్‌ పర్యటన

న్యూఢిల్లీ, డిసెంబరు 5: కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రుడో తన ప్రియురాలు, అమెరికా పాప్‌స్టార్‌ కేట్‌పెర్రీతో కలిసి జపాన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ జపాన్‌ మాజీ ప్రధాని కిషిదా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ట్రుడో, పెర్రీ కలిసి విందుకు వచ్చిన విషయాన్ని కిషిదా స్వయంగా వెల్లడించారు. ‘‘ట్రుడో తన భాగస్వామితో కలిసి జపాన్‌ను సందర్శించారు. నేను ఇచ్చిన విందులో పాల్గొన్నారు’’ అంటూ వారి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు ట్రుడో రీపోస్టు చేశారు. ట్రుడో, కేట్‌ పెర్రీ డేటింగ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అనేక కార్యక్రమాలకు వాళ్లు కలిసి వెళ్లారు. తాజాగా కిషిదా కేట్‌ పెర్రీని ట్రుడో ‘భాగస్వామి’ అని పేర్కొనడంతో అది నిజమేనని తేలింది.

Updated Date - Dec 06 , 2025 | 04:11 AM