Tharoor Calls Trump Unpredictable: ట్రంప్ చంచల మనస్కుడు
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:31 AM
సామాన్యప్రజానీకం ఎప్పుడూ వినని.. ఆంగ్లేయులకు సైతం అర్థం కాని అరుదైన ఆంగ్ల పదాలతో మాటల గారడీ చేసే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తాజాగా ...
సింగపూర్, సెప్టెంబరు 12: సామాన్యప్రజానీకం ఎప్పుడూ వినని.. ఆంగ్లేయులకు సైతం అర్థం కాని అరుదైన ఆంగ్ల పదాలతో మాటల గారడీ చేసే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తాజాగా ట్రంప్ తీరుపై తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ని ‘మెర్క్యూరియల్ ఇండివిడ్యువల్’.. అనగా ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియని చంచల మనస్కుడైన వ్యక్తిగా అభివర్ణించారు. అమెరికాలో వ్యవస్థలు దేశాధ్యక్షుడికి చిత్తం వచ్చినట్టుగా వ్యవహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయని విమర్శించారు. ట్రంప్ సుంకాలు భారత్‌ను దెబ్బతీస్తున్నాయని.. ఇప్పటికే సూరత్‌లో రత్నాభరణాల రంగంలో 1.35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. సీఫుడ్, ఉత్పత్తి రంగాల్లోనూ గణనీయంగా ఉద్యోగాలు పోతున్నాయని.. ఆందోళన వ్యక్తం చేశారు.