Dhaka protest: ఢాకాలోని భారతహైకమిషన్ వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:21 AM
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆందోళనకారులు హైకమిషన్ వైపు దూసుకుపోయేందుకు యత్నించారు....
వీసా కేంద్రం మూసివేసిన భారత్
బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు జారీ
ఢాకా, న్యూఢిల్లీ, డిసెంబరు 17: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆందోళనకారులు హైకమిషన్ వైపు దూసుకుపోయేందుకు యత్నించారు. భారత్‌లో ఉంటోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా వీసా కేంద్రాన్ని భారత్ మూసి వేసింది. ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయానికి బెదిరింపుల నేపథ్యంలో వీసా కేంద్రాన్ని మూసివేసింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఆ దేశ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమిదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.