President Vladimir Putin: మహా ఆర్థిక శక్తి భారత్
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:40 AM
భారత్ మహా అర్థిక శక్తి అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
బీజింగ్, సెప్టెంబరు 3: భారత్ మహా అర్థిక శక్తి అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బహుళ ధ్రువాలు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ఏ ఒక్కరి ఆధిపత్యం లేదని, అందరూ సమానమేనని తెలిపారు. బ్రిక్స్ వంటి కూటముల్లో భారత్, చైనా వంటి మహా ఆర్థిక శక్తులు ఉన్నా ప్రపంచ రాజకీయాలు, భద్రతపై ఆధిపత్యం వహించాలన్నదానిపై ఎప్పుడూ చర్చించలేదని అన్నారు. భారత్ మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేయడం, సుంకాలను పెంచడం నేపథ్యంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకొంది.