Share News

Clinical Trials: రష్యా క్యాన్సర్‌ వ్యాక్సిన్‌..క్లినికల్‌ ట్రయల్స్‌లో 100శాతం సమర్థత

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:27 AM

క్యాన్సర్‌కు సంబంధించి విప్లవాత్మక మార్పునకు ముందడుగు పడింది. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారంగా రష్యా రూపొందించిన క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఎంటరోమిక్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో...

Clinical Trials: రష్యా క్యాన్సర్‌ వ్యాక్సిన్‌..క్లినికల్‌ ట్రయల్స్‌లో 100శాతం సమర్థత

మాస్కో, సెప్టెంబరు 7: క్యాన్సర్‌కు సంబంధించి విప్లవాత్మక మార్పునకు ముందడుగు పడింది. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారంగా రష్యా రూపొందించిన క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఎంటరోమిక్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో 100శాతం సమర్థతను సాధించింది. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో 25 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లు పాల్గొనగా.. వారందరిలో రోగనిరోధక శక్తి ఏర్పడిందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ రేడియాలజీ సెంటర్‌, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఆంకాలజీ సెంటర్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కీమోథెరపీతో రేడియేషన్‌ దుష్ప్రభావం ఉన్నట్లు.. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదని పేర్కొన్నారు. 2, 3 దశల ట్రయల్స్‌ తర్వాత వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 04:29 AM