Share News

Russia Bridge Collapse: రష్యాలో కూలిన 2 రైలు వంతెనలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:23 AM

రష్యాలో రెండు వంతెనలు కూలి రెండు రైలు ప్రమాదాలు సంభవించాయి. ఉక్రెయిన్‌ ఉగ్రవాదుల కారణంగా ఈ వంతెనలను పేల్చినట్లు రష్యా సీనియర్‌ సెనేటర్‌ ఆరోపించారు.

Russia Bridge Collapse: రష్యాలో కూలిన 2 రైలు వంతెనలు

గూడ్స్‌, ప్రయాణికుల రైళ్లకు ప్రమాదం

ఉక్రెయిన్‌ పనేనని అనుమానం

రష్యాలో కూలిన రెండు రైలు వంతెనలు

ఉక్రెయిన్‌ పనేనని అనుమానం

మాస్కో, జూన్‌ 1: రష్యాలో 24 గంటల వ్యవధిలో రెండు వంతెనలు కూలి రైలు ప్రమాదాలు జరగడం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆదివారం గూడ్సు రైలు ప్రయాణిస్తున్న సమయంలోనే ఓ వంతెన కూలింది. శనివారం కూడా ప్రయాణికుల రైలు వెళ్తున్న సమయంలోనే మరో వంతెన కుప్పకూలింది. ఇందుకు ఉక్రెయినే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న కుర్స్క్‌ ప్రాంతంలో గూడ్సు రైలు ప్రమాదం జరిగింది. రైలులోని కొంత భాగం కిందనున్న రోడ్డుపై పడింది. డ్రైవర్‌ గాయపడ్డట్టు సమాచారం అందింది. పేలుడు కారణంగానే ఈ బ్రిడ్జి కూలినట్టు రష్యాకు చెందిన ఇంటర్‌ఫ్యాక్స్‌ ఏజెన్సీ తెలిపింది. శనివారం రాత్రి బ్రైన్సక్‌ ప్రాంతంలో కూడా వంతెన కుప్పకూలడంతో అదే సమయంలో దానిపై నుంచి వెళ్తున్న మాస్కో- క్లిమోవ్‌ రైలు ప్రమాదానికి గురయి పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, 69 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో రైలు డ్రైవరు కూడా ఉన్నారు. చీకట్లో ప్రయాణికులు ఒకరినొకరు సహాయం చేసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్‌ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని, అందుకే వంతెనలను పేల్చివేస్తోందని రష్యాకు చెందిన సీనియర్‌ సెనేటర్‌ ఒకరు ఆరోపించారు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:23 AM