Share News

Putin to Discuss Boosting Imports: మోదీతో భేటీలో దిగుమతుల పెంపుపై చర్చిస్తా

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:24 AM

భారత పర్యటనలో తాను ప్రధాని మోదీతో.. ఇండియా నుంచి దిగుమతులను పెంచడంపై చర్చిస్తానని పుతిన్‌ తెలిపారు. గడిచిన మూడేళ్లలో భారత్‌...

Putin to Discuss Boosting Imports: మోదీతో భేటీలో దిగుమతుల పెంపుపై చర్చిస్తా

మాస్కో: భారత పర్యటనలో తాను ప్రధాని మోదీతో.. ఇండియా నుంచి దిగుమతులను పెంచడంపై చర్చిస్తానని పుతిన్‌ తెలిపారు. గడిచిన మూడేళ్లలో భారత్‌, చైనా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం గణనీయంగా పెరిగిందని ఆయన వెల్లడించారు. ఆ రెండు దేశాలతో పాటు.. తమ కీలక భాగస్వాములందరితో ఆర్థిక బంధం బలోపేతం చేసుకోవాలని మాస్కో భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అదే సమయంలో.. పాశ్యాత్య దేశాల ప్రభుత్వాలపై ఆయన తీవస్ర్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా.. యూరప్‌ దేశాలు దౌత్యనీతిని పూర్తిగా వదిలిపెట్టేశాయని ఆయన దుయ్యబట్టారు. ‘‘యూరప్‌ యుద్ధం చేయాలనుకుంటే అందుకు మేం సిద్ధం. యూరోపియన్లకు శాంతియుత ఎజెండా లేదు. వారు యుద్ధం వైపే ఉన్నారు’’ అని పుతిన్‌ మండిపడ్డారు. తమ ఏకఛత్రాధిపత్యాన్ని ఉపయోగించి ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున్న కొన్ని దేశాల వల్ల ప్రపంచం అశాంతిని ఎదుర్కొంటోందన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 03:24 AM