Share News

Australia Protests: ఇండియన్లకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ఆందోళన

ABN , Publish Date - Sep 01 , 2025 | 07:12 AM

విదేశాల నుంచి వచ్చిన వలసదార్లు, ప్రధానంగా భారతీయులకు వ్యతిరేకంగా ఆదివారం ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. ఒక ప్రణాళిక ప్రకారం మార్చ్‌ ఫర్‌ ఆస్ట్రేలియా పేరుతో ఈ ప్రదర్శనలను..

Australia Protests: ఇండియన్లకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ఆందోళన

కాన్‌బెర్రా, ఆగస్టు 31: విదేశాల నుంచి వచ్చిన వలసదార్లు, ప్రధానంగా భారతీయులకు వ్యతిరేకంగా ఆదివారం ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. ఒక ప్రణాళిక ప్రకారం ‘మార్చ్‌ ఫర్‌ ఆస్ట్రేలియా’ పేరుతో ఈ ప్రదర్శనలను నిర్వహించారు. భారతీయుల వలసలు దేశ సంస్కృతికి ముప్పు కలిగిస్తున్నాయని నిర్వాహకులు ఆరోపించారు. ఇది ‘కొత్త సంస్కృతి స్థాపన’కు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. 100 ఏళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కన్నా అయిదేళ్లలో వచ్చిన భారతీయుల సంఖ్యే అధికంగా ఉందని విమర్శించారు. వలసదార్ల కారణంగా ఇళ్ల కొరత ఏర్పడిందని, ఉద్యోగ భద్రత తగ్గిందని, జీవన ప్రమాణాలు, పర్యావరణం, జాతీయ గుర్తింపునకు ముప్పు ఏర్పడిందన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 07:14 AM