Share News

Washington DC: ట్రంప్‌పై నిరసన గళం

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:24 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై స్వదేశంలో నిరసన గళం వెల్లువెత్తింది. దేశ రాజధాని నగర వీధుల్లో ఫెడరల్‌ దళాలను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వాషింగ్టన్‌ డీసీలో..

Washington DC: ట్రంప్‌పై నిరసన గళం

  • వాషింగ్టన్‌లో ఫెడరల్‌ దళాలకు నిరసనగా భారీ ర్యాలీ

వాషింగ్టన్‌ డీసీ, సెప్టెంబరు 7: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై స్వదేశంలో నిరసన గళం వెల్లువెత్తింది. దేశ రాజధాని నగర వీధుల్లో ఫెడరల్‌ దళాలను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వాషింగ్టన్‌ డీసీలో అనేక వేల మంది రోడ్డెక్కారు. తక్షణమే నేషనల్‌ గార్డుల మోహరింపును ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. నగరంలో నేరాలు పెచ్చుమీరుతున్నాయంటూ గత నెలలో ట్రంప్‌ వాషింగ్టన్‌ డీసీలో ఫెడరల్‌ దళాలను మోహరించారు. మెట్రోపాలిటన్‌ పోలీసు విభాగాన్ని కూడా నేరుగా ఫెడరల్‌ నియంత్రణలోకి తీసుకొచ్చారు. దీన్ని ఫెడరల్‌ ప్రభుత్వ అతిక్రమణ చర్యగా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. ‘ట్రంప్‌ తక్షణమే వెళ్లిపోవాలి’, ‘డీసీకి స్వేచ్ఛ కల్పించాలి’, ‘నిరంకుశత్వాన్ని ప్రతిఘటించండి’ తదితర పోస్టర్లను నిరసనకారులు ప్రదర్శించారు.

Updated Date - Sep 08 , 2025 | 04:25 AM