Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:47 AM
పోప్ ఫ్రాన్సిస్ (88) అంత్యక్రియలు శనివారం రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ముగిశాయి. ఆయన పార్థివ దేహానికి ప్రపంచ దేశాలాధినేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.
ముగిసిన అంత్యక్రియలు..హాజరైన రాష్ట్రపతి ముర్ము
వాటికన్ సిటీ, ఏప్రిల్ 26: సోమవారం కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ (88) అంత్యక్రియలు రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో శనివారం ముగిశాయి. దాదాపు వంద సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఓ పోప్ అంత్యక్రియలను వాటికన్ సిటీ అవల నిర్వహించారు. పోప్‌కు ఇష్టమైన రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేసినట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రైవేటుగా నిర్వహించారు. కేవలం ఉన్నత స్థాయి కార్డినల్స్, పోప్ సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము సహా 50 దేశాల అధినేతలు, ప్రముఖుల ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మెక్రాన్, యూకే యువరాజు విలియమ్, ఆ దేశ ప్రధాని కెయిర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, స్పెయిన్ రాజ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు పోప్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే దాదాపుగా 2.50 లక్షల మంది సామాన్య ప్రజలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా, రాష్ట్రపతి ముర్ము వెంట కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్