PM Modi Gifts Bhagavad Gita: పుతిన్‌కు రష్యన్ భగవద్గీత గిఫ్ట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:16 AM
పుతిన్‌కు ప్రధాని మోదీ చిరస్మరణీయంగా ఉండే పలు బహుమతులు అందజేశారు. దేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా, భారత-రష్యా స్నేహానికి గుర్తులుగా వాటిని బహూకరించారు....
పుతిన్‌కు ప్రధాని మోదీ చిరస్మరణీయంగా ఉండే పలు బహుమతులు అందజేశారు. దేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా, భారత-రష్యా స్నేహానికి గుర్తులుగా వాటిని బహూకరించారు. విశేషంగా రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత గ్రంథాన్ని స్వయంగా ఆయనకు అందజేశారు. ఇదే కాకుండా దేశంలోని నలుమూలలకు చెందిన వస్తువులను బహుమతులుగా ఇచ్చారు. అస్సాంకు చెందిన ‘బ్లాక్ టీ’ పొడిని అందజేశారు. దీనికి తోడుగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో తయారు చేసిన వెండి టీ కప్పుల సెట్‌ను ఇచ్చారు. ‘రెడ్ గోల్డ్’గా పిలుచుకునే కశ్మీరీ కుంకుమ పువ్వును కానుకగా మోదీ పుతిన్‌కు అందజేశారు.