Share News

Las Vegas: ఆకాశంలోనే విమాన ఇంజన్‌లో మంటలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:27 AM

ఆకాశంలో ఉండగా ఓ అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజన్‌లో మంటలు వ్యాపించడంతో దాన్ని అత్యవసరంగా కిందికి దించివేయాల్సి వచ్చింది.

 Las Vegas: ఆకాశంలోనే విమాన ఇంజన్‌లో మంటలు

  • 159 మంది సురక్షితం.. అమెరికాలో ఘటన

లాస్‌ వేగాస్‌, జూన్‌ 26: ఆకాశంలో ఉండగా ఓ అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజన్‌లో మంటలు వ్యాపించడంతో దాన్ని అత్యవసరంగా కిందికి దించివేయాల్సి వచ్చింది. లాస్‌ వేగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం 8.15 గంటలకు ఆ విమానం 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 159 మందితో బయలుదేరింది. కాసేపటికే కుడి ఇంజన్‌లో సమస్యలు తలెత్తి మంటలు వ్యాపించినట్టు గుర్తించి దాన్ని వెనక్కి మళ్లించి ఐదు నిమిషాల్లోనే అత్యవసరంగా కిందికి దించారు. సిబ్బంది అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించి విమానాన్ని సురక్షితంగా కిందికి దింపడంతో ప్రయాణికులు ఎవరికెలాంటి నష్టం జరగలేదు. ఉత్తర కరోలినాలోని చార్లొటే డగ్లస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా మెకానికల్‌ సమస్య తలెత్తడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఆ విమానయానసంస్థ తెలిపింది.

Updated Date - Jun 27 , 2025 | 03:27 AM