Share News

Asim Munir: పాక్‌ సైన్యాధిపతికి త్రివిధ దళాలపై పెత్తనం!

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:28 AM

అత్యున్నత స్థాయిలో త్రివిధ దళాల సమన్వయానికి పాకిస్థాన్‌ కొత్తగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ సీడీఎఫ్‌ అనే పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....

Asim Munir: పాక్‌ సైన్యాధిపతికి త్రివిధ దళాలపై పెత్తనం!

  • కొత్తగా సీడీఎఫ్‌ పదవి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం.. సెనేట్‌లో బిల్లు

  • ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ చేతుల్లో మరింత అధికారం

ఇస్లామాబాద్‌, నవంబరు 8: అత్యున్నత స్థాయిలో త్రివిధ దళాల సమన్వయానికి పాకిస్థాన్‌ కొత్తగా ‘చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌’ (సీడీఎఫ్‌) అనే పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సైన్యాధిపతికే ఈ బాధ్యతలు కూడా అప్పగించనుంది. శనివారం ఆ దేశ క్యాబినెట్‌ ఈ నిర్ణయాన్ని ఆమోదించిన నేపథ్యంలో.. రాజ్యాంగంలో సైనికదళాలకు సంబంధించిన ఆర్టికల్‌ 243లో సవరణలు ప్రతిపాదిస్తూ అధికారపక్షం.. పార్లమెంటు ఎగువసభ సెనేట్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దీనిప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు ఆర్మీ చీఫ్‌ను/ సీడీఎ్‌ఫను దేశాధ్యక్షుడు నియమిస్తారు. సీడీఎఫ్‌ ప్రధానితో సంప్రదింపులు జరిపి జాతీయవ్యూహాత్మక కమాండ్‌ అధిపతిని నియమిస్తారు. కాగా, ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ చేతుల్లో మరింత అధికారాన్ని కేంద్రీకృతం చేయటంలో భాగంగానే ఈ బిల్లును తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో భారత్‌తో యుద్ధం అనంతరం, పాక్‌ ప్రభుత్వం ఆయనకు ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే.

Updated Date - Nov 09 , 2025 | 01:28 AM