Share News

Munir Awards Himself Hilal E Jurat: తనకు తానే అవార్డు ఇచ్చుకున్న మునీర్‌

ABN , Publish Date - Aug 16 , 2025 | 02:48 AM

పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌, మరోసారి తన అసాధారణ స్థాయి నాటకీయతను రక్తికట్టించారు...

Munir Awards Himself Hilal E Jurat: తనకు తానే అవార్డు ఇచ్చుకున్న మునీర్‌

  • పాక్‌ ఆర్మీ చీఫ్‌కు హిలాల్‌ ఇ జురాత్‌

పాకిస్థాన్‌, ఆగస్టు 15: పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌, మరోసారి తన అసాధారణ స్థాయి నాటకీయతను రక్తికట్టించారు. యుద్ధ వేళల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే వారికి ఇచ్చే రెండో అత్యున్నత సైనిక పురస్కారం హిలాల్‌-ఇ-జురాత్‌ను తనకు తానే ప్రకటించుకుని, పుచ్చేసుకున్నారు. ఇది భారతదేశంలోని మహా వీర్‌ చక్ర అవార్డుతో సమానం. భారత్‌తో ఇటీవల జరిగిన ఘర్షణ సందర్భంగా అద్భుతమైన స్థాయిలో నాయకత్వ ప్రతిభా పాటవాలు కనబర్చానంటూ.. పాక్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆయనే స్వయంగా అందుకున్నారు. అలాగే, భారత్‌తో జరిగిన యుద్ధానికి తానే నాయకత్వం వహించానని చెప్పుకుంటున్న ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అత్యున్నత పురస్కారం నిషాన్‌-ఇ-ఇమ్తియాజ్‌ ప్రకటించేసుకుని, అందుకున్నారు. ఆయనతో పాటు దేశంలోని అగ్ర రాజకీయ, సైనికాధికారులు కూడా తమకు తామే పురస్కారాలు ప్రకటించుకున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 02:48 AM