Tehreek Taliban Pakistan: మగాడివైతే యుద్ధానికి రా
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:40 AM
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌కు తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) తీవ్ర హెచ్చరికలు చేసింది,
పాక్ ఆర్మీ చీఫ్‌కు తాలిబన్ల సవాల్
న్యూఢిల్లీ, అక్టోబరు 23: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌కు తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) తీవ్ర హెచ్చరికలు చేసింది. పాక్ ఆర్మీ తన సైనికులను చావడానికి పంపడం మానుకోవాలని హితవు పలికింది. దీని బదులు ఉన్నతాధికారులే యుద్ధక్షేత్రంలోకి దిగి ముందుండి నడిపించాలని సవాలు విసిరింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో టీటీపీ ఈ మేరకు పాక్ ఆర్మీకి హెచ్చరికలు చేయడం గమనార్హం. పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా టీటీపీ విడుదల చేసింది. ‘నువ్వు మగాడివైతే మమ్మల్ని ఎదుర్కో! తల్లిపాలు తాగినోడివైతే మాతో యుద్ధం చెయ్యి’ అంటూ ఆ వీడియోల్లో మునీర్‌ను ఉద్దేశించి టీటీపీ కమాండర్ కజీమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.