Share News

Nigeria Floods: నైజీరియాలో వరదలు..150మంది మృతి

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:36 AM

నైజీరియాలో కుండపోత వర్షాలకు భారీ వరదలు ఏర్పడి మోక్వా పట్టణాన్ని ముంచేశాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమై 150 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Nigeria Floods: నైజీరియాలో వరదలు..150మంది మృతి

అబూజా (నైజీరియా), మే 31: నైజీరియాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. గురువారం ఉదయం కురిసిన కుండపోత వర్షానికి కొన్నిగంటల్లోనే వరదలు సంభవించి నైజర్‌ రాష్ట్రంలోని ముఖ్య వ్యాపార పట్టణమైన మోక్వా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. భారీ వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఘోరమైన వరదల వల్ల శనివారం నాటికి 150 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక అత్యవసర సేవల విభాగం తెలిపింది.

Updated Date - Jun 01 , 2025 | 04:36 AM