Share News

Israel launched New Airstrikes on Gaza: గాజా మళ్లీ రక్తసిక్తం

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:05 AM

అమెరికా మధ్యవర్తిత్వంలో అక్టోబరు 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది....

Israel launched New Airstrikes on Gaza: గాజా మళ్లీ రక్తసిక్తం

  • ఇజ్రాయెల్‌ దాడుల్లో 104 మంది మృతి

టెల్‌అవీవ్‌/గాజా, అక్టోబరు 29: అమెరికా మధ్యవర్తిత్వంలో అక్టోబరు 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 46 మంది చిన్నారులు సహా 104 మంది మృతిచెందారు. 253 మంది గాయపడ్డారు. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్‌ కాల్పులు జరపడానికి ప్రతీకారంగా హమా్‌సకు చెందిన 30 లక్ష్యాలపై శక్తిమంతమైన దాడులు చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది. దాడులు పూర్తి కాగానే తిరిగి కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నామని ప్రకటించింది. అమెరికాకు సమాచారం ఇచ్చాకే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు గాజాపై దాడులకు ఆదేశాలిచ్చారని సమాచారం. సైన్యంపై దాడిచేస్తే ప్రతిదాడులు జరపవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇజ్రాయెల్‌ దాడులను సమర్థించారు. అయితే గాజాలో శాంతిని ఎవరూ అస్థిరపరచలేరని చెప్పారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్‌ ఇంకా 13 మంది బందీల మృతదేహాలను అప్పగించాల్సి ఉంది.

Updated Date - Oct 30 , 2025 | 04:05 AM