Share News

Oman: ఆదాయపు పన్ను విధించే యోచనలో ఒమన్‌

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:56 AM

గల్ఫ్‌ దేశం ఒమన్‌ 2028 నుంచి ఆదాయపు పన్ను(ఐటీ) విధించాలని యోచిస్తోంది. ఏడాదికి 42 వేల రియాల్స్‌ (సుమారు రూ.95 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5శాతం ఆదాయపు పన్ను విధించాలని చూస్తోంది.

Oman: ఆదాయపు పన్ను విధించే యోచనలో ఒమన్‌

  • అమలు చేస్తే తొలి గల్ఫ్‌ దేశంగా రికార్డు

మస్కట్‌, జూన్‌ 23: గల్ఫ్‌ దేశం ఒమన్‌ 2028 నుంచి ఆదాయపు పన్ను(ఐటీ) విధించాలని యోచిస్తోంది. ఏడాదికి 42 వేల రియాల్స్‌ (సుమారు రూ.95 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5శాతం ఆదాయపు పన్ను విధించాలని చూస్తోంది. ఈ ఆదాయ జాబితాలో సుమారు ఒక శాతం మంది ఉంటారని అంచనా. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు ఒమన్‌ ఆర్ధిక మంత్రి సయ్యద్‌ బిన్‌ మొహ్మద్‌ అల్‌ సక్రీ చెప్పారు. ఈ ఆర్ధిక సంస్కరణలతో గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌లోని మిగతా దేశాలైన సౌదీ అరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, యూఏఈ, ఖతర్‌ దేశాలకు ఒమన్‌ ఆదర్శంగా నిలిచే అవకాశముందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ దేశాలు ద్రవ్యలోటు ఎదుర్కొనే అవకాశాలున్నాయని, ఈ తరుణంలో ఆర్ధిక సంస్కరణలు ఉత్తమమని ఐఎంఎఫ్‌ సూచిస్తోంది. ఈ దేశాలకు ముడిచమురే ప్రధాన ఆదాయవనరైనా అంతర్జాతీయంగా శిలాజ ఇంధనాలకు డిమాండ్‌ తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ధిక సంస్కరణలు తప్పనిసరి అని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 03:57 AM