Share News

జపాన్‌ వీధుల్లో డ్రైవర్‌ రహిత కారు రయ్‌ రయ్‌!

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:13 AM

అది జపాన్‌లోని యొకొహామా నగరం.. నిత్యం రద్దీగా ఉండే ఆ నగరంలో డ్రైవర్‌ లేకుండానే ఒక కారు రోడ్డుపై వెళుతోంది. డ్రైవింగ్‌ సీటులో ఎవరూ లేకున్నా తనంతట తానే స్టీరింగ్‌ని కంట్రోల్‌ చేసుకుంటూ.. సందులు, మలుపులు వచ్చినప్పుడు బ్రేకులు వేస్తూ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.

జపాన్‌ వీధుల్లో డ్రైవర్‌ రహిత కారు రయ్‌ రయ్‌!

  • డ్రైవర్‌ లెస్‌ వాహనాన్ని పరీక్షించిన నిస్సాన్‌ సంస్థ

యొకొహామా, మార్చి 10: అది జపాన్‌లోని యొకొహామా నగరం.. నిత్యం రద్దీగా ఉండే ఆ నగరంలో డ్రైవర్‌ లేకుండానే ఒక కారు రోడ్డుపై వెళుతోంది. డ్రైవింగ్‌ సీటులో ఎవరూ లేకున్నా తనంతట తానే స్టీరింగ్‌ని కంట్రోల్‌ చేసుకుంటూ.. సందులు, మలుపులు వచ్చినప్పుడు బ్రేకులు వేస్తూ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. సడెన్‌గా ఎవరైనా అడ్డొస్తే తనంతట తనే ఆగిపోతుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్‌.. సోమవారం ట్రాఫిక్‌, జనంతో నిండిన రోడ్లపై ఈ మానవ రహిత కారుని విజయవంతంగా పరీక్షించింది. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 లైడార్‌ సెన్సర్లను ఉపయోగించి అధునాతన టెక్నాలజీతో నిస్సాన్‌ ఈ డ్రైవర్‌ లెస్‌ కారుని అభివృద్ధి చేసింది.


ఇప్పటికే అమెరికాలో గూగుల్‌ సంస్థ అభివృద్ధి చేసిన డ్రైవర్‌ రహిత ‘వేమో’ కార్లకు ఇది పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ కంపెనీలకు నిలయమైన జపాన్‌లో ఈ ఏడాది ‘వేమో’ అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో నిస్సాన్‌ తన డ్రైవర్‌ లెస్‌ కారుని పరీక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పరీక్షలో నిస్సాన్‌ డ్రైవర్‌లెస్‌ కారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడిచింది.

Updated Date - Mar 11 , 2025 | 05:13 AM