Israeli Prime Minister Benjamin Netanyahu: నన్ను క్షమించండి..!
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:58 AM
అవినీతి కేసులో తనపై జరుగుతున్న సుదీర్ఘ విచారణను ముగించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దేశాధ్యక్షుడిని క్షమాపణ కోరారు....
ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడికి నెతన్యాహు అభ్యర్థన
టెల్ అవీవ్, నవంబరు 30: అవినీతి కేసులో తనపై జరుగుతున్న సుదీర్ఘ విచారణను ముగించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దేశాధ్యక్షుడిని క్షమాపణ కోరారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయ న్యాయ విభాగానికి తన అభ్యర్థనను సమర్పించారని ప్రధాని కార్యాలయం ఆదివారం తెలిపింది. అయితే ఇది ‘అసాధారణ అభ్యర్థన’గా అభివర్ణించిన అధ్యక్ష కార్యాలయం.. దీనితో పాటు పలు ముఖ్యమైన చిక్కులున్నట్లు పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. తన సంపన్న రాజకీయ మద్దతుదారుల కోసం నెతన్యాహు అక్రమాలకు పాల్పడ్డారని.. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనపై మోసం, నమ్మక ద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలున్నాయి. అయితే ఇంకా ఏ కేసులోనూ ఆయన దోషిగా తేలలేదు. నెతన్యాహును క్షమించాలంటూ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖ రాసిన వారాల వ్యవధిలోనే.. ఈ పరిణామం చోటుచేసుకుంది.