Microsoft Employees: ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:57 AM
అమెరికా వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పాలస్తీనీయన్లకు మద్దతుగా నిరసనకు దిగిన ఆ కంపెనీకి చెందిన 18 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు
వాషింగ్టన్, ఆగస్టు 21: అమెరికా వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పాలస్తీనీయన్లకు మద్దతుగా నిరసనకు దిగిన ఆ కంపెనీకి చెందిన 18 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మైక్రోసాఫ్ట్ రూపొందించిన సాంకేతికతను వాడుకొనే గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందంటూ 35మందితో కూడిన బృందం రెండు రోజులుగా ఈ ఆందోళనలు చేపట్టింది. ఇజ్రాయెల్‌తో మైక్రోసాఫ్ట్ వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని వెళ్లిపోవాలని సూచించినా వెనక్కి తగ్గలేదు. మైక్రోసాఫ్ట్ బోర్డుపై రంగులు పూసి నినాదాలతో హోరెత్తించారు. దీంతో 18 మంది ఉద్యోగులను పలు అభియోగాల కింద పోలీసులు అరెస్టు చేశారు.