Fatima Bash: మిస్‌యూనివర్స్‌గా మెక్సికో సుందరి ఫాతిమా బాష్
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:25 AM
థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికో అందగత్తె ఫాతిమా ఫెర్నాండెజ్ బాష్ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు...
బ్యాంకాక్, నవంబరు 21: థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికో అందగత్తె ఫాతిమా ఫెర్నాండెజ్ బాష్ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తన అందం, తెలివితేటలతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచారు. పోటీ మధ్యలో అతిథ్య దేశానికి చెందిన ఓ హోస్ట్ ఆమెను అవమానించినా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎదురు నిలిచి అందరి మన్ననలు పొందారు. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన అందాల భామ విక్టోరియా హెల్విగ్.. ఫాతిమాకు అందాల కిరీటం అందజేశారు. దాదాపు 120 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనగా.. వారందరినీ కాదని 25ఏళ్ల ఫాతిమాను విజయం వరించింది. ఽఽథాయ్‌లాండ్ భామ మొదటి రన్నర్‌పగా నిలవగా, వెనెజువెలా సుందరి రెండో రన్నర్‌పతో సరిపెట్టుకున్నారు.