Share News

Infrastructure Damage: బ్యాంకాక్‌లో 50 మీటర్లు కుంగిన రోడ్డు!

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:57 AM

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నడిబొడ్డున.. రోడ్డు ఆకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయి 50 మీటర్ల భారీ గొయ్యి ఏర్పడింది. ఫలితంగా పలు వాహనాలు...

Infrastructure Damage: బ్యాంకాక్‌లో 50 మీటర్లు కుంగిన రోడ్డు!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నడిబొడ్డున.. రోడ్డు ఆకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయి 50 మీటర్ల భారీ గొయ్యి ఏర్పడింది. ఫలితంగా పలు వాహనాలు ధ ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోయి, కరెంటు తీగలు గాల్లో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. నీటి పైపులైన్లు పగిలిపోయు పెద్ద ఎత్తున్న నీరు పైకి ఉబికి రావడంతో పాటు సమీపంలోని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన బుధవారం ఉదయం సమ్సెన్‌ రోడ్డులోని ఓ ఆస్పత్రి సమీపంలో జరిగింది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా హాస్పిటల్‌ నుంచి రోగులను, సమీప అపార్ట్‌మెంట్‌ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో జరుగుతోన్న భూగర్భ రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనుల కారణంగానే భారీ గొయ్యి ఏర్పడిందని బ్యాంకాక్‌ గవర్నర్‌ చాడ్‌చార్ట్‌ సిట్టిపాంట్‌ స్పష్టం చేశారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 03:57 AM